చిన్నతుంబళంలోని రాయల చెరువులో నీటి కుక్కలు

58చూసినవారు
పెద్దకడుబూరు మండలం చిన్నతుంబళంలోని రాయల చెరువులో ఆదివారం నీటి కుక్కలు కనిపించాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. చెరువులో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నీటి కుక్కలు ప్రత్యక్షమయ్యాయని చెప్తున్నారు. పిల్లలను చెరువు పరిసరాల్లోకి వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్