పచ్చిమిరప రైతులను ఆదుకోవాలి: ఏపీ రైతు సంఘం

85చూసినవారు
పచ్చిమిరప పంట వేసిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో.. మంగళవారం పగిడ్యాల మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో రైతులు వేసిన పచ్చిమిరప పంటను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. జిల్లా నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పచ్చిమిర్చి ఒక మడుము 300 నుండి 500 వరకు రేటు పలికిందని, ఈ సీజన్ లో పచ్చి మిర్చి పంట రైతుల కళ్ళల్లో కన్నీరు పెట్టించిందని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు సుధాకర్,అల్లా బాకాస్, రాముడు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.