ఈనెల 8 నుంచి 15 వరకు ప్రజా సమస్యల పరిష్కారానికై ప్రజా పోరు ధర్నాలు నిర్వహిస్తామని సిపిఐ, సిపిఎం జిల్లా నాయకులు పకీర్ సాహెబ్ శనివారం తెలిపారు. నందికొట్కూరు పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్, మండల కార్యాలయం వద్ద ఈనెల 8 నుంచి 15 వరకు నిర్వహించే ధర్నాలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.