కర్నూలు జిల్లాలో గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని హౌసింగ్ పీడీ సిద్ధలింగమూర్తి అధికారులను ఆదేశించారు. శనివారం ఓర్వకల్లు మండలంలోని నన్నూరు గ్రామ సమీపంలోని జగనన్న లేఅవుట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రూప్ లెవెల్‌లో ఉన్న గృహాలను అక్టోబరు నెలాఖరులోగా, బేస్‌మట్టం లెవెల్‌లో ఉన్న గృహాలను మార్చిలోపు పూర్తి చేయాలన్నారు. నన్నూరులో బేస్‌మట్టంలో 323 గృహాలు, స్లాబ్‌లో 65 గృహాలు ఉన్నాయన్నారు.