కర్నూలు: శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

67చూసినవారు
కర్నూలు: శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోని శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ రవీంద్రబాబు చెప్పారు. బుధవారం కల్లూరు పరిధిలోని పందిపాడు, బీఆర్ రెడ్డి నగర్, వీవీఎస్ ఫంక్షన్ హాలు రోడ్డు, సాయినాథ్ నగర్ కాలనీలలో కమిషనర్ పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజలు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్