పాణ్యం: కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ రానుంది

78చూసినవారు
ఏన్డీఏ కూటమి ప్రభుత్వంలో రహదారులకు మహర్దశ రానుందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శనివారం కల్లూరు మండల పరిధిలో ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతు పనులను ఆమె ప్రారంభించి, మాట్లాడారు. గత వైసీపీ పాలనలో రోడ్లను ఏ మాత్రం బాగుచేయలేదని, పల్లెల నుంచి పట్టణాల రహదారులు అడుగుల మేర గోతులు ఏర్పడ్డాయన్నారు. జనవరి 31 లోపు పాణ్యం నియోజకవర్గంలోని రహదారుకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్