పాణ్యం మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలు గ్రామాల ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. కొండజూటూరులో ఆక్రమణకు గురైన చెరువు సమస్యను పరిష్కరిస్తామన్నారు. పాణ్యం బస్టాండ్ వద్ద మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ప్రతి సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్తామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.