పెనమలూరు: భారతీయ ప్రాచీన వారస్వత విజ్ఞాన సంపద యోగా
భారతీయ ప్రాచీన వారస్వత విజ్ఞాన సంపద "యోగా" కేవలం వ్యాయామమే కాక, ఉత్తమ జీవన విధానమని ఉయ్యూరు మున్సిపల్ కమీషనర్ పాయసం వెంకటేశ్వరరావు అన్నారు. ఉయ్యూరులోని సాత్విక్ యోగ చారిటబుల్ ట్రస్ట్ సర్వసభ్య సమావేశం ఆదివారం స్థానిక లైబ్రరీ రోడ్ లో జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు సాత్విక్ యోగా చారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ సిహెచ్ వి. వి. కుటుంబరాజు అధ్యక్ష బాధ్యత నిర్వర్తించారు.