రాష్ట్రంలో భూకబ్జాల నియంత్రణకు భూకబ్జాల నిరోధక చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం తాడిగడప లోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ భూకబ్జాలపై 8,305 ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. 7,873 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నిర్ధారించామని గత ప్రభుత్వం 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ గా ప్రకటించిందని తెలిపారు.