మన్ కీ బాత్ తరహాలో త్వరలో మీతో మీ చంద్రబాబు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. శనివారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ తరహాలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రజలతో నేరుగా మాట్లాడనున్నారని తెలిపారు. సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు.