పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నగరంలో ఓ మహిళ వైద్యురాలపై జరిగిన అత్యాచారం ఆపై హత్యను నిరసిస్తూ ఆత్మకూరు పట్టణంలో శనివారం ప్రైవేట్ ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహాయించి ఇతర సేవలు నిలిపివేయనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆత్మకూరు అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం వారు మాట్లాడుతూ తాము చేపట్టే నిరసనలకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.