మహానంది విద్యుత్‌ కార్యాలయాల్లో ఆయుధ పూజలు

60చూసినవారు
మహానంది విద్యుత్‌ కార్యాలయాల్లో ఆయుధ పూజలు
మహానంది మండలంలోని తిమ్మాపురం, బుక్కాపురం, మహానంది గ్రామాల్లోని సబ్ స్టేషన్లలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో విద్యుత్ శాఖ ఏఈ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ సిబ్బందికి, ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. విద్యుత్ సిబ్బంది ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా విధులు నిర్వహించాలని శనివారం అన్నారు. సబ్ ఇంజనీర్ మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్