ఆత్మకూరు ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణంలో 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారి నెట్ బాల్ టోర్నమెంట్స్ ను రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ముందుగా ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆత్మకూరు ఆర్డీవో భూమి రెడ్డి పావని, పోలీసు అధికారులు ఉన్నారు.