నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలానికి చెందిన “సొసైటీ సోషల్ రెస్పాన్సిబులిటీ” అనే నూతన స్వచ్ఛంద సంస్థ లోగోను ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ రమేష్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. లోగో ప్రారంభించకముందు కమిషనర్ రమేష్ బాబుకు స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కోదండపాణి శాలువాతో ఘనంగా సత్కరించారు.
సొసైటీ సోషల్ రెస్పాన్సిబులిటీ సేవా సంస్థ లోగో ఆవిష్కరణ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని అలీపురం గ్రామానికి చెందిన దేవర పాటి వెంకటరమణమ్మ అనే వృద్ధురాలు కు బియ్యం, నిత్యావసర సరుకులు, పండ్లు సంస్థ వ్యవస్థాపకులు కోదండపాణి, ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణచౌదరి చేతుల మీదుగా అందజేశారు.
ఆ వృద్ధురాలు సేవా సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్బంగా కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ సమాజ సేవ చేయడానికి ముందుకొచ్చిన ఆ సంస్థ సభ్యులను అభినందించారు. రెస్పాన్సిబులిటీ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు కోదండపాణి మాట్లాడుతూ నాకు సహాయ సహకారాలు అందించే ముందుకు నడిపిస్తున్న ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామకృష్ణ చౌదరికు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరెన్నో సేవా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఐక్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు పయ్యావుల రామకృష్ణచౌదరి, అహ్మద్, జశ్వంత్, పవన్, మస్తానయ్య, స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.