ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఐడీ చీఫ్‌గా, ఫైర్ సర్వీసెస్ డీజీగా ఉన్న సమయంలో ఏపీఎస్ సంజయ్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ అవినీతిపై ఏసీబీ అధికారులు విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఆయనను ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ అధికారులు సర్కార్‌ను రిక్వెస్ట్ చేశారు.