బిర్యానీలో బ్లేడ్.. షాకైన కస్టమర్ (వీడియో)

54చూసినవారు
బిర్యానీలో బ్లేడ్ వచ్చిన ఘటన ఘట్కేసర్ లో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. బీబీ నగర్ మండలం మక్త అనంతారం గ్రామానికి చెందిన బింగి ఐలయ్య అతడి ఫ్రెండ్స్ తో కలిసి ఆదర్శ్ బార్ & రెస్టారెంట్లో బిర్యానీ తినేందుకు వెళ్లారు. ఈ క్రమంలో బిర్యానీ ఆర్డర్ చేసి తింటుండగా అందులో బ్లేడ్ వచ్చింది. దీంతో షాకైనా కస్టమర్ యాజమాన్యాన్ని నిలదీయగా.. కావాలని రాలేదని, అనుకోకుండా వచ్చిందని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాధితుడు PSలో ఫిర్యాదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్