TG: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై శనివారం రాత్రి అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. థియేటర్‌కు వెళ్లిన కాసేపటికే పోలీసులు చెప్పడంతో తాను వెళ్లిపోయానని బన్నీ తెలిపారు. అయితే ఆయన ఇంటర్వెల్ వరకూ ఉన్నారని, జాతర సీన్ కూడా చూశారని పలువరు ట్విట్టర్‌లో వీడియోలు పెడుతూ #allu arjun arested ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు మహిళ చనిపోయిన విషయం ఆయనకు పోలీసులు చెప్పలేదని బన్ని ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.