మర్రిపాడు: బాలల దినోత్సవం వేడుకలు

80చూసినవారు
మర్రిపాడు: బాలల దినోత్సవం వేడుకలు
మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వేడుకలు నిర్వహించారు. ముందుగా భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జవహర్ లాల్ నెహ్రూ గురించి బాలల దినోత్సవం గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్