Oct 16, 2024, 10:10 IST/
ముంబైలో భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం
Oct 16, 2024, 10:10 IST
ముంబైలోని లోఖండ్ వాలా బుధవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ కాంప్లెక్స్ లో ప్రమాదవశాత్తు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురు సజీవదహనం అయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.