రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పీఎం అన్నదాత ఆయ్ సంరక్షణ్ అభియాన్’ పథకానికి రూ.35 వేల కోట్లు కేటాయించింది. 2025-26 సంవత్సరానికి గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ.150 పెంచి రూ.2,425కు పెంచింది. ఆవాలు క్వింటాల్‌పై రూ.300 పెంచింది. శెనగలు క్వింటాల్‌పై రూ.210 పెంచినట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.