నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ డివిజన్ పరిధిలోని భీమవరం గ్రామంలో ఆక్రమణకు గురైన డొంక స్థలాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ పరిశీలించారు. గురువారం సర్వేయర్లను అడిగి స్థలం యొక్క వివరాలు, ఆక్రమించిన వారి యొక్క వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ లావణ్య, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. అనంతరం గ్రామస్తులు ఆక్రమణకు గురైన పలు స్థలాల గురించి సబ్ కలెక్టర్ కు వివరించారు.