కందుకూరు లోని పడమటి బలిజపాలెం, చాకలి పాలెం కూడలి వద్ద మున్సిపల్ వాటర్ పైప్లైన్ పగిలి త్రాగునీరు వృధాగా పోవడానికి విద్యుత్ శాఖ సిబ్బంది అజాగ్రత్తే కారణమని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయడానికి మున్సిపల్ అధికారులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుంత తీయడంతో సిమెంట్ పైపులైన్ దెబ్బతిని నీరు వృధాగా పోయిందని తెలిపారు. వెంటనే వాటికి మరమ్మతులు చేస్తామని తెలిపారు.