జెమిలి ఎన్నికలు- భారత ప్రజాస్వామ్యం- రాజ్యాంగం పై దాని ప్రభావం. అన్న అంశంపై ఆదివారం సాయంత్రం కందుకూరులో చర్చ వేదిక జరిగింది. ప్రోగ్రెసివ్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం వెనుక ఉన్న దాచురి రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సదస్సులో జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు డాక్టర్ హరిబాబు, బోసు బాబు తదితరులు పాల్గొని మాట్లాడారు.