గుడ్లూరు మండలంలోని సాలిపేట బీసీ కాలనీ వాసులకు రామాయపట్నం పోర్టు ప్యాకేజీ అందించాలని ఆ కాలనీ వాసులు కందుకూరు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజకు బుధవారం వినతిపత్రం అందజేశారు. పోర్టు కోసం తమ భూములన్ని తీసుకొని తమ ఇళ్లకు మాత్రం పరిహారం ఇవ్వకపోవడం అన్యాయమని వాపోయారు. సాలిపేట, కర్లపాలెం ఎస్టి కాలనీ వాసులకు ఇచ్చిన రీతిగానే తమకు ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. వీరికి సిఐటియు మద్దతు తెలిపింది.