అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు

74చూసినవారు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్న పోలీసులు
నెల్లూరు జిల్లా లింగసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నెబోయినపల్లి దగ్గర మున్నేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసు సిబ్బందితో కలిసి దాడి చేసినట్లు ఎస్సై మహమ్మద్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న టాక్టర్ ను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.

సంబంధిత పోస్ట్