నెల్లూరు జిల్లా దగదర్తి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు యామాల శేఖర్ అనారోగ్యంతో నెల్లూరులోని నారాయణ ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు శనివారం ఆసుపత్రికి వెళ్లి వారిని కలిశారు. ఈ సందర్భంగా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఎల్లప్పుడు తాను అండగా ఉంటానని మాలేపాటి భరోసా కల్పించారు.