తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు ఆ పార్టీ శాశ్వత సభ్యత్వాన్ని తీసుకున్నారు. మంగళవారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా రూ. లక్ష చెల్లించి, తెలుగుదేశం పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకోన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో సభ్యత్వాలు జరిగే విధంగా నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.