మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు హాజరయ్యారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాలేపాటి బ్రదర్స్ తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా పార్టీ జీవితకాల సభ్యత్వాన్ని మాలేపాటి రవీంద్ర తీసుకున్నారు.