రాష్ట్ర మైన్స్, జియాలజీ, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర ని విజయవాడలోని వారి స్వగృహం నందు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు, నెల్లూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర కలిశారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి సంక్షిప్తంగా ఆయనకు వివరించారు. అలాగే కావలి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.