

బోగోలు: కన్నుల పండుగగా వెంకటేశ్వరుని కళ్యాణం
బోగోలు మండలం కొండ బిట్రగుంటలోని శ్రీ బిలకోట ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన కళ్యాణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే, మంత్రి, ఎమ్మెల్సీ, ఉన్నత స్థాయి అధికారులు, ప్రముఖులు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవారి కళ్యాణాన్ని తిలకించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా భక్తులతో కిటకిటలాడింది.