కావలి: అధికారులపై మండిపడ్డ మాలేపాటి
దగదర్తి మండల ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలేపాటి సుబ్బానాయుడు ప్రజల సమస్యలపై ఎంపీడీవోతో మాట్లాడారు. ఇప్పటికీ దగదర్తి సచివాలయంలో వైసిపి నేతల ఫోటోలను తొలగించకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. తురిమెర్ల పంచాయతీలో నీటి సమస్య గురించి ప్రజలు ఎంతో కాలంగా విన్నవించుకుంటున్నా సమస్యను పట్టించుకోకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు.