
కావలి: అర్పిత హత్య కేసులో వెలుగులోకి సంచలన నిజాలు
నెల్లూరు జిల్లా కావలిలో డిసెంబర్ 1న అర్పిత బిస్వాస్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ కేసుకి సంబంధించి డిఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ.. అర్పితను అనుభవించాలనే కోరికతో నిందితుడు ఆమె భర్త శ్రీకాంత్తో కలిసి మద్యం తాగాడు. శ్రీకాంత్ మత్తులోకి జారుకున్నాక.. పక్క గదిలో నిద్రిస్తున్న అర్పితపై లౌంగిక దాడికి యత్నించాడు. ఆమె అడ్డుకోవడంతో రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం చనిపోయిన ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆయన వెల్లడించారు.