Feb 07, 2025, 05:02 IST/
తెలంగాణలో పగలు ఎండ.. రాత్రి ఉక్కపోత
Feb 07, 2025, 05:02 IST
తెలంగాణలో చాలా వేగంగా వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో సాధారణం కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు వెల్లడించారు. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్లో 35.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఇది సాధారణం కన్నా 3.4 డిగ్రీలు అధికం. దీంతో రాష్ట్రంలో పగలు ఎండలు మండుతుండగా.. రాత్రిపూట ఉక్కపోతగా ఉంటోంది. కొన్ని రోజులుగా దాదాపు అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.