గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ.. మంత్రి లోకేశ్ చొరవతో స్వదేశానికి రాక

56చూసినవారు
గల్ఫ్‌లో చిక్కుకున్న మహిళ.. మంత్రి లోకేశ్ చొరవతో స్వదేశానికి రాక
గల్ఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఓ మహిళకు మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ఆయన చొరవతో షేక్ మున్నీ అనే మహిళ స్వస్థలానికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన షేక్ మున్నీ ఉపాధి కోసం కువైట్ వెళ్లారు. అక్కడ ఆమె యజమాని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడు. తన ఇబ్బందులను ట్విట్టర్(X) ద్వారా మంత్రి లోకేశ్‌కు విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి తన టీం ద్వారా మున్నీని క్షేమంగా రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్