రోడ్డుపై బోల్తా పడిన కంటైనర్
కొడవలూరు మండలం పరిధిలోని రాచర్లపాడు ఇఫ్కో కిసాన్ సెజ్ సమీపంలో బాస్మతి రైస్ తో వెళుతున్న ఓ కంటైనర్ అదుపు తప్పి ఒక్కసారిగా గురువారం సాయంత్రం రోడ్డు మీద బోల్తా కొట్టింది. హైదరాబాదు నుంచి చెన్నై హార్బర్ కు వెళ్తున్న కంటైనర్ బోల్తా పడిన సంఘటన చోటు చేసుకున్నది. డ్రైవర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.