బుచ్చి రెడ్డి పాలెం పట్టణంలో అంబేద్కర్ నగర్లో గల అనాధ శరణాలయంలో అన్నం సత్యనారాయణ - అనంతలక్ష్మి ప్రధమ వర్ధంతి సందర్భంగా పిల్లలకు వృద్ధులకి ఆహారం, పండ్లు, బిస్కెట్లు, స్వీట్లు, వేరుశెనగ చిక్కీలు, స్టీల్ ప్లేట్లు పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు మొదలగునవి పంచిపెట్టారు. అతని తమ్ముడు నందం భాస్కర్ మాట్లాడుతూ.. మా చేసిన సేవలు వారి కీర్తి ఎనలేనిదని గొప్ప మానవత్వావాది ఎన్నో ఒడిదుడుకులను అధిగమించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆ పుణ్య దంపతులు గత సంవత్సరం కరోనా కారణంగా పరమపదం చెందినారు. వారి పవిత్రఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని అన్నారు.