జొన్నవాడలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానంకు ఎఎంఆర్ గ్రూప్ అధినేత ఆల్తూరి మహేష్ రెడ్డి, రాధిక దంపతులు ఆదివారం శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనంకు వచ్చి అమ్మవారికి మంగళ సూత్రం కానుకగా అందజేశారు. శ్రీ కామాక్షితాయి అమ్మవారికి సుమారు 207 గ్రాములు విలువైన సరుడుతో కూడిన బంగారు మంగళసూత్రంను భక్తి తో సమర్పించారు.