టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు అమరావతిలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబుకి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ప్రశాంతిరెడ్డి దంపతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.