సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి కోవూరు పరిధిలో మంగళవారం కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ ను పోలీసులు నిర్వహించారు. స్థానిక స్టవ్ బీడీ కాలనీ, లక్ష్మీ నారాయణ పురంలో సుమారు 1200 గృహాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 50 బైకులు, 6 ఆటోలు స్వాధీనం, 10 మంది రౌడీ షీటర్స్ ను విచారించారు.