నెల్లూరు సెంట్రల్ జైలును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి శనివారం పరిశీలించారు. బుజబుజ నెల్లూరు సమీపంలోని కేంద్ర కారాగారాన్ని పరిశీలించి మహిళా ఖైదీల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. జైలులో మహిళా ఖైదీలకు కల్పిస్తున్న వసతి సౌకర్యాలను చైర్ పర్సన్ కు జైలు అధికారులు వివరించారు.