నెల్లూరు నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య పనులను మరింత మెరుగ్గా నిర్వహించే క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు వేసేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ సచివాలయ శానిటేషన్ కార్యదర్శులను ఆదేశించారు. నెల్లూరు కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో పారిశుద్ధ్య విభాగంతో సమీక్షా సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.