నగల కోసం నెల్లూరులో దారుణ హత్య చోటు చేసుకుంది. సూట్ కేసులో మృతదేహాన్ని తరలిస్తుండగా మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు పాత మున్సిపల్ ఆఫీస్ సమీపంలో ఉంటున్న రమణి (65) కూరగాయలు కొనేందుకు వెళ్ళగా ఆమె ఇంటి పక్కనే ఉండే బంగారు షాప్ యజమాని సుబ్రమణ్యం, ఆమె కుమార్తె దివ్య రమణిని వెంబడించి హత్య చేశారు. ఒంటిపై ఉన్న బంగారు నగలు తీసుకున్నారు. మృతదేహాన్ని సూట్ కేసులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.