నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని డీకే డబ్ల్యూ కళాశాల సమీపంలో డివైడర్ పనులను టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా డివైడర్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. స్థానిక అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. కార్పొరేషన్ ఈ, ఈ శేషగిరిరావు, స్థానిక నేతలు పాల్గొన్నారు.