దేశంలో ధనవంతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ 4 బిలియన్ డాలర్లకు చేరుకోగా కోటీశ్వరుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది. ఫిన్‌టెక్, ఇ-కామర్స్,స్పేస్ టెక్నాలజీ, రక్షణ వంటి రంగాలు అనూహ్యంగా విస్తరించడంతో ఆర్థిక వ్యవస్థ బలపడి ధనవంతుల సంఖ్య పెరుగుతోంది. దేశంలో 334 మంది బిలియనీర్లు ఉన్నట్లు పలు సంస్థల అంచనా. ఇందులో ఎక్కువ మంది ఆర్థిక రాజధాని ముంబాయిలోనే ఉన్నారు.