నెల్లూరు నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన పన్నులను సకాలంలో చెల్లించి నగర అభివృద్ధికి బాధ్యతగా బకాయిదారులంతా సహకరించాలని కమిషనర్ సూర్యతేజ తెలియజేశారు. స్పెషల్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా నెల్లూరు మినీ బైపాస్ లోని వివిధ కమర్షియల్ బిల్డింగులు, నూతన భవన నిర్మాణాలను వివిధ విభాగాల అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, పాల్గొన్నారు.