భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) నెల్లూరు నగర కమిటీ ఆధ్వర్యంలో కోటమిట్ట సెంటర్ నుండి ఐదవ రోజు బుధవారం ప్రజాపోరు యాత్ర ప్రారంభమైంది. స్థానిక కుక్కలగుంట, పాత మున్సిపల్ ఆఫీస్, సంతపేట, ములుముడి బస్టాండ్ సెంటర్ మీదుగా రంగనాయకులపేట సెంటర్ వరకు జరిగినది. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు నగర సీనియర్ నాయకులు పి. చంద్రా రెడ్డి, నగర కమిటీ సభ్యులు షేక్. రషీద్, అత్తిమూరు శ్రీనివాసులు, ఫయాజ్ లు మాట్లాడారు.