టిడిపి హయాంలో అప్పటి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సహకారంతో స్వర్ణాల చెరువుని అభివృద్ధి చేశామని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరులో ఆదివారం ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు నెల్లూరు జిల్లా అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. గణేష్ ఘాట్ సమీపంలో ఆద్యంతం కన్నుల పండుగ సాగిన శ్రీ స్వర్ణ లింగేశ్వర స్వామి జీర్ణోద్ధరణ మహాకుంభాభిషేకంలో మంత్రి పాల్గొన్నారు.