నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి శనివారం రాత్రి పరిశీలించారు. ముఖ్యంగా విగ్రహాలు రాకపోకలకు తీసుకుంటున్న చర్యలు, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. ఉత్సవ కమిటీ నేతలతో మాట్లాడి వారి సలహాలను తీసుకున్నారు. అనంతరం అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.