మదర్ థెరిస్సాకు నివాళులర్పించిన పాస్టర్స్ అసోసియేషన్
నెల్లూరు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులు అర్పించారు. నెల్లూరు నగరంలోని లోన్ స్టార్ చర్చిలో మదర్ థెరీసా విగ్రహానికి సోమవారం పలువురు పూలమాలలు వేసి ఆమె చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి అన్ని మండలాల్లో కన్వీనర్లను ఏర్పాటు చేశారు.