స్వాతంత్ర సమరయోధులు, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ కు సోమవారం నెల్లూరు నగరంలోని ఆవాస్ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఆవాస్ జిల్లా కార్యదర్శి ఎస్. కె రషీద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ విద్యా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ రూరల్ కార్యదర్శి ఎస్ డి రఫీ పాల్గొన్నారు